BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

ఆటో నుంచి జారిపడిన వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు

Select Suryaa Now
ఆటో నుంచి జారిపడిన వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు

దోమ మండలంలో విషాద ఘటన.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి

దోమ, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29):దోమ మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడగా, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడిపై నుంచి దూసుకెళ్లడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన దేశమోని యాదయ్య తన అల్లుడు శ్రీనివాస్‌ను కలిసేందుకు చాపలగూడెం వైపు ఆటోలో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణిస్తున్న క్రమంలో యాదయ్య ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు అదుపు తప్పి కిందపడిన యాదయ్యపై నుంచి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో యాదయ్య తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే యాదయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దోమ ఎస్సై వసంత్ జాదవ్ తెలిపారు.రిపోర్టర్ చాపల బద్రి.