BREAKING
యాసంగిలో వరి సాగును తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయండి కాంగోలో మారుతున్న తిరుగుబాటు వ్యూహాలు నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమాపై నాగార్జున స్పందన.. టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శంకుస్థాపన

Select Suryaa Now
33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శంకుస్థాపన

సూర్య  పెద్దకొడప్గల్: మండలంలోని కాటేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న అంతరాయాలను తగ్గించి, రైతులు, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో కాటేపల్లిలో నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే స్థానిక విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రజలకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి, వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు విద్యుత్ సేవలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చొరవతో పాటు ఎమ్మెల్యే కృషితో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ముందడుగు పడిందని నాయకులు పేర్కొన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌లను నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దకొడప్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.