BREAKING
ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే జీటీఏ సిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 440 పాయింట్లకు పైగా కుంగిన సెన్సెక్స్

Select Suryaa Now
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 440 పాయింట్లకు పైగా కుంగిన సెన్సెక్స్
ముంబై, నవంబర్ 18: రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, గత రెండు రోజుల ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం సూచీలపై ఒత్తిడి పెంచింది. ఉదయం 11:00 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 440 పాయింట్లకు పైగా నష్టపోయి 82,100 స్థాయి వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమై 25,235 మార్కు వద్ద కదలాడుతోంది. రంగాలవారీగా చూస్తే మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ప్రధానంగా హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. ఫార్మా, హెల్త్‌కేర్, రియాల్టీ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. మారుతీ సుజుకీ, అపోలో హాస్పిటల్స్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.