national
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,098 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండు రోజుల లాభాల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపడం, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సూచీలు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,098 పాయింట్లు నష్టపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా భారీగా క్షీణించి 25,572 పాయింట్ల వద్ద ముగిసింది.
రెండు రోజులుగా లాభాల్లో కొనసాగిన ఐటీ, ఎఫ్‌ఎంసీజీ (FMCG), బ్యాంకింగ్ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా 5 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 98 డాలర్లకు చేరడం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు క్షీణించి 92.62 వద్ద స్థిరపడటం ఇన్వెస్టర్లలో ఆందోళనను మరింత పెంచింది.