national
తిరుప్పరంకుండ్రం దీపం రేపు వెలిగించండి
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం దీపం కేసులో సుప్రీంకోర్టు అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ తమిళనాడు ఉన్నతాధికారులందరికీ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
నోటీసులు అందుకున్న వారిలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP), మదురై జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. వీరితో పాటు దేవాదాయ శాఖ (HR & CE) డిప్యూటీ సెక్రటరీ, కమిషనర్, ఆలయ ఈవో (EO), ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్ మరియు ట్రస్టీలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మొత్తం అధికార యంత్రాంగం తదుపరి విచారణకు వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా, వివాదానికి కారణమైన దీపాన్ని రేపు తప్పనిసరిగా వెలిగించాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది.