BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

రస్సెల్ బ్రాండ్ కేసులో ప్రారంభమైన జ్యూరీ విచారణ

Select Suryaa Now
రస్సెల్ బ్రాండ్ కేసులో ప్రారంభమైన జ్యూరీ విచారణ

బ్రిటిష్ నటుడు, కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌  పై నమోదైన లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణల విచారణ కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో లండన్ కోర్టులోని జ్యూరీ సభ్యులు తమ చర్చలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యూరీ ప్రతినిధులు కేవలం ఏకగ్రీవ తీర్పును మాత్రమే కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ విచారణలో ఆరుగురు మహిళలు రస్సెల్ బ్రాండ్‌పై ఆరోపణలు చేయగా, ఆయన ప్రస్తుతం మూడు అత్యాచారం కేసులు, మూడు లైంగిక దాడి కేసులు మరియు ఒక యత్నించిన లైంగిక వేధింపుల కేసుతో సహా మొత్తం 7 కేసులను ఎదుర్కొంటున్నారు. 1999 నుండి 2009 మధ్యకాలంలో ఈ సంఘటనలు జరిగినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.

విచారణలో భాగంగా రస్సెల్ బ్రాండ్ తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు. తనపై మోపబడిన నేరాలన్నీ అబద్ధాలని, ఇరువైపులా సమ్మతి తోనే సంబంధాలు జరిగాయని ఆయన కోర్టులో వాదించారు.

ప్రస్తుతం జ్యూరీ సభ్యులు సాక్ష్యాధారాలను పరిశీలిస్తుండటంతో, త్వరలోనే ఈ సంచలనాత్మక కేసులో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.