'మాలామాల్ వీక్లీ 2': ప్రియదర్శన్, రితీష్ దేశ్‌ముఖ్ లేకుండా సీక్వెల్!
2006లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన బ్లాక్‌బస్టర్ కామెడీ చిత్రం 'మాలామాల్ వీక్లీ' సీక్వెల్ 'మాలామాల్ వీక్లీ 2'కు సంబంధించిన ఒక కీలక వార్తా వెలుగులోకి వచ్చింది. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు ప్రియదర్శన్ మరియు కథానాయకుడు రితీష్ దేశ్‌ముఖ్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై దర్శకుడు ప్రియదర్శన్ స్పందిస్తూ... “నేను ఈ సినిమా చేయడం లేదు. ఇకపై ఎలాంటి సీక్వెల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను” అని స్పష్టం చేశారు. తన పాత సినిమాలకు సీక్వెల్స్ చేయడానికి ఆసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
మరోవైపు, మొదటి భాగంలో కీలక పాత్రలో నటించిన రితీష్ దేశ్‌ముఖ్ కూడా ఈ సీక్వెల్ నుంచి వైదొలిగారు. దీనితో ఈ సీక్వెల్‌ను కొత్త దర్శకుడు అమిత్ జోషి దర్శకత్వంలో, కొత్త నటీనటులతో తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, ఒరిజినల్ చిత్రంలో నటించిన దివంగత నటులు ఓం పురి, అస్రానీ లేకపోవడం మరియు ప్రియదర్శన్-రితీష్ తప్పుకోవడంతో ఈ కొత్త భాగాన్ని పూర్తిగా కొత్త కథనంతో, గ్రామీణ నేపథ్య హాస్యంగా రూపొందించనున్నట్లు సమాచారం.