BREAKING
టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి!

జిమ్ జిమ్ తార సాంగ్ క్రేజ్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న పర్ణశాల ఫుల్ లిరికల్ వీడియో

Select Suryaa Now
జిమ్ జిమ్ తార సాంగ్ క్రేజ్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న పర్ణశాల ఫుల్ లిరికల్ వీడియో

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా మారుమోగుతున్న జిమ్ జిమ్ తార జిమ్‌ జిమ్‌ తార జిలేబీ తేరా చిన్నోడా పాట ట్రెండింగ్ సెన్సేషన్‌గా మారింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, పూర్తి సాంగ్ బయటకు రాకముందే ఈ పాటకు సంబంధించిన చిన్న బిట్‌తో నెటిజన్లు వేల సంఖ్యలో రీల్స్, షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని చిత్ర యూనిట్ తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియోను అధికారికంగా విడుదల చేసింది. సాంగ్ రిలీజ్ అయిన క్షణం నుంచే యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తూ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

వై.జి. భరత్ దర్శకత్వంలో ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత మంచి వెంకట్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతాన్ని జి. లక్ష్మిదేవి స్వయంగా రచించి, అత్యంత శక్తివంతంగా ఆలపించడం విశేషం. ఆమె గొంతులోని మాస్ వైబ్స్, క్యాచీ లిరిక్స్ శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. పూర్తి పాట విడుదల కాకముందే కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన క్లిప్స్‌తోనే సామాన్యుల నుంచి ప్రముఖ సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాదాలకు స్టెప్పులేస్తూ వీడియోలు షేర్ చేయడం ఈ ట్రెండ్ ఎంత బలమైనదో తెలియజేస్తోంది.

పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ మా పర్ణశాల సినిమా కోసం జి.లక్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పూర్తి పాట విడుదల తర్వాత ఊహించినదాని కంటే ఎక్కువగానే అనూహ్య స్పందన వస్తోందని, ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని, పూర్తి పాటకు కూడా అన్ని వర్గాల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.

హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, తాజాగా ఈ వైరల్ సాంగ్ తెచ్చిన హైప్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది.