BREAKING
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం

వివాదాలకు తావు లేకుండా న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాలి..కలెక్టర్ మహేష్ కుమార్..

Select Suryaa Now
వివాదాలకు తావు లేకుండా న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాలి..కలెక్టర్  మహేష్ కుమార్..

అమలాపురం మేజర్ న్యూస్ :వివాదాలకు తావులేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, మత్స్యశాఖ అధికారులు, ధవళేశ్వరం బోట్‌మెన్ అండ్ ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులతో సహజ వనరుల నుంచి రొయ్య పిల్లల సేకరణకు సంబంధించిన వివాదం, లభ్యత, ఆదాయం, సేకరణకు సంబంధించిన నిబంధనలు, రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసులు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధవళేశ్వరం ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలకు చట్టపరమైన నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహజ వనరుల నుంచి రొయ్య పిల్లల సేకరణకు సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఎటువంటి వివాదాలకు తావులేకుండా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
గోదావరి నదిలో సహజంగా లభించే రొయ్య పిల్లల సంతానోత్పత్తి, సేకరణ విధానం, లభ్యత తదితర వివరాలను జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రొయ్య పిల్లల సేకరణ, విక్రయాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలపై మత్స్యకార సొసైటీ ప్రతినిధులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, అనుకూలతలను బట్టి రొయ్య పిల్లల సేకరణ చేపడుతున్నట్లు సొసైటీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు.
ధవళేశ్వరం బ్యారేజీ పరిధిలోని గేట్లకు సంబంధించిన వివరాలను సైతం కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ పరిధిలోని నిర్దిష్ట ప్రాంతాల్లో రొయ్య పిల్లల సేకరణ జరుగుతున్నట్లు మత్స్యకార సొసైటీ ప్రతినిధులు వివరించారు.రొయ్య పిల్లల సేకరణ ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి సుమారు 500 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని సొసైటీ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తమకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ధవళేశ్వరం మత్స్యకార సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వం నుంచి లీజు తీసుకుని రొయ్య పిల్లల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. బొబ్బర్లంక మత్స్యకారుల వైఖరి తమపై ప్రభావం చూపుతోందని, ఇరు ప్రాంతాల మత్స్యకార కుటుంబాలకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
అప్సడా సీడ్ యాక్ట్–2020, జి.ఓ.ఎం.ఎస్. నం.46, రూల్ 8(1) ప్రకారం రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసి, ధవళేశ్వరం, బొబ్బర్లంక ప్రాంతాలకు చెందిన మత్స్యకార కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనల మేరకు సత్వర చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సహజ వనరుల నుంచి లభించే రొయ్య పిల్లల పరిరక్షణతో పాటు వాటి సహజ సంతానోత్పత్తికి ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, వివాదాలకు తావులేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె. కరుణాకర్ రావు, కాకినాడ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ అధికారిణి కె. శ్రావణి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సి.హెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు