విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం : ముఖ్యఅతిథిగా హాజరైన ఛైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి
మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : విశ్వం ఇంజినీరింగ్ కళాశాల మదనపల్లెలో రాజ్యాంగ దినోత్సవం (కాన్స్టిట్యూషన్ డే)ను ఘనంగా నిర్వహించారు.గురువారం కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి.ఆర్.రామకృష్ణ నేతృత్వంలో విద్యార్థులకు భారత రాజ్యాంగంలోని విలువలు,హక్కులు,బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఘననివాళులర్పించారు.రాజ్యాంగ రచనలో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.విద్యార్థులు రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.న్యాయం,స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం వంటి విలువలకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు.ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి.ఆర్.రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడి,1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు.విద్యార్థులు రాజ్యాంగ విలువలను పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి,డైరెక్టర్ నందిత రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ బి.డి.వెంకటరమణా రెడ్డి మరియు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుబ్బారెడ్డి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి,ఎన్ఎస్ఎస్ యూనిట్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి