విద్యతోనే మానవ వికాసం..
నరసన్నపేట, సూర్య : నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ ప్రధమ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినని 2008 సంవత్సరం నుండి భారతదేశంలో విద్యా దినోత్సవం గా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ పెద్దాడ లత అన్నారు. విద్యా మానవ వికాసానికి, దేశ సంస్కృతి చారిత్రక పరిరక్షణకు, దేశ అభివృద్ధికి కీలకమైనదని ఆమె అన్నారు. మౌలాన్ అబూల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజుల్లోనే వయోజన విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యా విభాగాలను అమలు చేశారని ప్రిన్సిపల్ గుర్తు చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చరిత్ర అధ్యాపకులు పి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో లౌకిక విద్యకు మౌలానా పునాదులు వేసారని, యుజిసి స్థాపన, ఐఐటీస్, జాతీయ గ్రంథాలయాల స్థాపన మొదలగు కీలక నిర్ణయాలు భారతీయ విద్యా విధానాన్ని సుసంపన్నం చేశాయని అన్నారు.