BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

విద్యతో బంగారు భవిష్యత్తు

Select Suryaa Now
విద్యతో బంగారు భవిష్యత్తు

బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్  :  విద్యతో బంగారు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని మండల విద్యాశాఖాధికారి  వై రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కోనేటి మిట్టలోని సౌత్ మండల పరిషత్ ప్రాథమిక గిరిజన బాల, బాలికల పాఠశాలలో బుధవారం "సహారా ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ "వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత నోటు పుస్తకాలు, పెన్ లు,పెన్సిళ్లు,పలకలు, ఎరేజర్లు,పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందాలన్నారు. పేద పిల్లలు చదువుకునేందుకు సొసైటీ వారు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సొసైటీ అధ్యక్షులు షేక్ ఎస్ధాని బాషా మాట్లాడుతూ నేడు సుమారు వందమంది పేద విద్యార్థులకు విద్యాసామాగ్రి అందించినట్లు, గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా నిర్వహిస్తామన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె చిన్నయ్య, ఎం షకీల, సిహెచ్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.