BREAKING
52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట!

విద్యార్థులలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయాలి

Select Suryaa Now
విద్యార్థులలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయాలి

బొబ్బిలి, అక్టోబర్ 09: మేజర్ న్యూస్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా బొబ్బిలిలోని ఆనందోబ్రహ్మ క్రియేటివ్ డాన్స్ అండ్ యాక్టింగ్ అకాడమీ విశేష కృషి చేస్తోంది. ఈ అకాడమీకి చెందిన విద్యార్థులు , ధర్మశాస్త్ర కోలాటం బృందం తో కలసి శుక్రవారం ఉదయం విశాఖపట్నం, విజయవాడ, శ్రీ శైలం కోలాట ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షులు విజయ మోహన రావు, మాజీ కౌన్సిలర్ బొబ్బాది తవిటి నాయుడు గొల్లపల్లి దాడితల్లి గుడివద్ద  విద్యార్థులకు  ఘనంగా వీడ్కోలు పలికి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విజయ మోహన రావు మాట్లాడుతూ, “పిల్లల కు  సరైన అవకాశం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తే అద్భుతాలు సృష్టించగలరనీ,  కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ప్రదర్శనలు వల్ల  వారిలో క్రమశిక్షణ, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పె రుగుతాయన్నారు. తవిటి నాయుడు మాట్లాడుతూ
కోలాటం మన తెలుగు సంస్కృతికి ప్రతీక అని, తరతరాలుగా వస్తున్న ఇటువంటి జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ దిశగా కృషి చేస్తున్న ఆనందోబ్రహ్మ అకాడమీ కి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోలాటం గురు బొంతల కోటి మధు, అకాడమిక్ కన్వీనర్ టీ కమల్ కుమార్, భవాని , పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.