BREAKING
వట్లూరు ఎంపిటిసి అభ్యర్థిగా అంబేద్కర్ నామినేషన్ అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు ఏసియన్ పారా గేమ్స్ 4వ రోజు భారత్ హవా.. స్వర్ణ పతకాలతో అదరగొట్టిన అర్చర్లు షీతల్ దేవి, తోమన్ కుమార్ రేపే ప్రభాస్ పుట్టినరోజు.. టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

వరిలో పొట్ట దశ వరకు మీరు నిల్వ లేకుండా చూడాలి

Select Suryaa Now
వరిలో పొట్ట దశ వరకు మీరు నిల్వ లేకుండా చూడాలి

నగరం, మేజర్ న్యూస్:
నీటి యాజమాన్యం ద్వారా విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిల్వ లేకుండా బురద మాత్రమే ఉండేలా రైతులు తగిన చర్యలు తీసుకోవాలని రేపల్లె ఇంచార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయాధికారి వేమూరి రమేష్ బాబు అన్నారు. గురువారం మండల పరిధిలోని పూడివాడలో నిర్వహించిన జిఏపి పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పొలంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోయే మార్గం ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన అధిక పిలకలతో కూడిన మొక్కలు పెరుగుతాయన్నారు. వరిలో ఆకు ముడత లేక నాము లేక తెల్ల తెగులు ఆశించిందని, దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 20 ఈసీ 2.5 మీ.లీ. లేక 0.3 మి.లీ. లేక క్లోరాంత్రనీప్రోల్ 20 ఈసీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. చిరు పొట్ట దశలో కార్ట్ ఆఫ్ హైడ్రా క్లోరైడ్ 50 ఎస్పి 2 గ్రా. లేదా ఎస్ పెట్ 75 ఎస్పి 1.5 గ్రా.  లేదా క్లోరాంత్రనీప్రోల్ 18.5 ఎస్పి మందును లీటరు నీటితో కలిపి పిచికారి చేసి పురుగులను నివారించుకోవచ్చు అన్నారు. తొలుత క్షేత్ర సందర్శన చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కె. నాగ శ్రీనివాసరావు, కె. వంశీకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు కె. భూదేవి, రైతులు పాల్గొన్నారు