BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

వరి పంటలను కాపాడుకోవడానికి రైతులకు జాగ్రత్తలు అవసరం

Select Suryaa Now
వరి పంటలను కాపాడుకోవడానికి రైతులకు జాగ్రత్తలు అవసరం


ఆమదాలవలస, అక్టోబర్ 29, మేజర్ న్యూస్ 
తుఫాన్ కారణంగా ఆమదాలవలస మండలంలో ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో వరి పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు సూచించారు.
ఈ మేరకు దూసి, తోగరం, నిమ్మతోర్లవాడ, నెల్లిపర్తి, కలివరం, శ్రీనివాసాచార్యులపేట గ్రామాల్లో పర్యటించి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు వ్యవసాయ సూచనలు చేశారు. వరి పొలాల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. నీరు సులభంగా బయటకు వెళ్లేలా కాలువలను శుభ్రం చేసుకోవాలి. పడిపోయిన వరి పంటను జాగ్రత్తగా కట్టలుగా కట్టి నిలబెట్టుకోవాలి. అగ్గి తెగులు లక్షణాలు కనిపిస్తే, వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఎకరాకు 120 గ్రాముల ట్రైసైక్లజోల్ పిచికారీ చేయాలి. కుళ్లు తెగులు లక్షణాలు కనిపించినప్పుడు, అధికారుల సూచనల మేరకు ఎకరాకు 400 మి.లీ. హెక్సాకొనజోల్ పిచికారీ చేయాలి. వర్షాలకు తడిసిన వరి పంటను పరిశీలించి, పంట పరిస్థితిని బట్టి 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేయాలి 
రైతులు తమ పొలాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, తెగుళ్ల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటించి పంట నష్టాన్ని తగ్గించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.