BREAKING
డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు

వైసీపీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ జగన్ కసరత్తు

Select Suryaa Now
వైసీపీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ జగన్ కసరత్తు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రేపు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే మేయర్ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు.

ఇప్పటికే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. అదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్ల మేయర్ స్థానాలతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ భేటీలో ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులు, సర్వే నివేదికలు మరియు గెలుపు గుర్రాలైన అభ్యర్థుల బలబలాలపై రీజనల్ కో-ఆర్డినేటర్లతో విస్తృతంగా చర్చించి తుది జాబితాకు రూపకల్పన చేయనున్నారు.