వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత
గూడూరు, మేజర్ న్యూస్ : వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎంపీటీసీ సెగ్మెంట్లకు పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోట మండలానికి సంబంధించి వైసీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మద్దతుదారులుగా ఉన్న ఏడు ఎంపీటీసీ సెగ్మెంట్ల వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. అదేవిధంగా, గూడూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడు కొడవలూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మద్దతుదారులుగా ఉన్న ఎనిమిది ఎంపీటీసీ సెగ్మెంట్ల వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు పంపిణీ చేశారు. కోట మండల వైసీపీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డికి కొక్కుపాడు ఎంపీటీసీ సెగ్మెంట్ వైసీపీ అభ్యర్థిగా బీ-ఫారాన్ని గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.