BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

వైద్యం వికటించి బాలిక మృతి?

Select Suryaa Now
వైద్యం వికటించి బాలిక మృతి?

బుట్టాయిగూడెం సూర్య న్యూస్: ఆర్.ఎం.పి  వైద్యం వికటించి  ఏడేళ్ల బాలిక  మృతి చెందినట్లు స్థానికుల నుండి ఆరోపణలు వచ్చాయి. వివరాలు ప్రకారం పేరంటాలపల్లి గ్రామస్తుల  పోలవరం నిర్వాసితులకు బుట్టాయిగూడెం మండలంలోని   రామన్నగూడెం గ్రామంలో ఆర్ అండ్ ఆర్  కాలనీ లు నిర్మించారు. గత కొంతకాలం నుండి ఇక్కడే నివాసం ఉంటున్నట్లు చెప్పారు.  గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు  ఇటీవల  తమ స్వగ్రామమైన  పేరంటాలపల్లి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఉండగానే బాలికకు జ్వరం కామెర్లు ఉన్నట్లు ఆరోదించారు. జ్వరంతోనే  అక్కడనుండి రామన్నగూడెం వచ్చినట్లు తెలిపారు. జ్వరం ఎక్కువగా రావడంతో రామన్నగూడెం పిహెచ్సి కి తీసుకువెళ్లగా బుట్టాయిగూడెం క్లస్టర్ ఆసుపత్రికి  రిఫర్ చేసినట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లగా మూడు రోజులు కోర్సు పెట్టాలని చెప్పి    ఇంజక్షన్ చేసినట్లు చెప్పారు. ఇంజక్షన్ చేసిన వెంటనే వైద్యం వికటించి మృతి  చెందినట్లు స్థానికులు  ఆరోపించారు. ఇది జరిగి రెండు రోజులు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అధికారులు  విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. విచారణలో వాస్తవం తెలియవలసి ఉంది.

 రిపోర్టర్: కట్ట మధు బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా