వాహన తనిఖీలను ముమ్మరం చేసిన ఏపిఎస్పీ బలగాలు
మదనపల్లె,మేజర్ న్యూస్ : జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలతో పోలీసులు రాత్రి గస్తీ,స్ట్రాంగ్ రూమ్స్ మరియు చెక్ పోస్ట్ ల దగ్గర ఏపిఎస్పీ బలగాలతో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు,ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ వినూత్నంగా "ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.ఏటీఎంలు,బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,నివాస ప్రాంతాల్లో,దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి,రాత్రివేళ అనుమానాస్పదంగా తిరిగే వారి వేలిముద్రలు సేకరిస్తున్నారు.శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని,అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.దాడులు,గొడవలు వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీలలో ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి