ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు
ప్యాపిలి, మేజర్ న్యూస్: తెదేపాకు నమ్మకద్రోహం చేసే వారిని ఎన్నికల్లో ఓడించి, ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కూటమి బలపరిచిన ప్యాపిలి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు కోరారు. గ్రామంలోని పలు వీధుల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీకి అండగా నిలిచే అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొప్పెల సరస్వతి, తెదేపా నాయకులు కొంగనపల్లి మధు, నడిగడ్డ నాగేంద్ర, గండికోట పెద్ద రామాంజనేయులు, కిట్టు తదితరులు పాల్గొన్నారు.