BREAKING
ఆకాశంలో ఒక తార టీమ్‌కు చిరంజీవి, రామ్ చరణ్ అభినందనలు.. దుల్కర్ సినిమాపై ప్రశంసల వర్షం నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి రాయపాటి సాంబశివరావు మృతి టీడీపీకి తీరని లోటు విక్కుర్తి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటన. ప్యాపిలిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం వైకాపా సర్పంచి అభ్యర్థికి మద్దతుగా బుగ్గన అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి ప్రచారం రాయపాటి సాంబశివరావుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘన నివాళి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి కూటమి సర్పంచ్‌ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు డిసెంబరు 6 న మహా బలిజ సంఘం వనభోజనం కుర్ని సంఘం కార్తీక వనబోజనలు గంప గుర్తుకు ఓటేయండి.. ఖాజాపీరా ప్రచారం : ప్యాపిలిలో ఇంటింటా తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరిన స్వతంత్ర అభ్యర్థి పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక:

డిసెంబరు 6 న మహా బలిజ సంఘం వనభోజనం

Select Suryaa Now
డిసెంబరు 6 న మహా బలిజ సంఘం వనభోజనం

డిసెంబర్ 6 తేదీన కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో బి.క్యాంప్ ఆటో స్టాండ్ సమీపంలో గల బలిజ కాపు భవన్ లో మహా బలిజ వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మన్న, రవికుమార్ లు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు టిజి భరత్ గుప్తా, గ్రేటర్ రాయలసీమ మహా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు మిద్దె శాంతిరాముడు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన కర్నూలు నగర కార్పొరేటర్లు, జిల్లా లోని మండల అధ్యక్షులు, జెడ్పిటిసిలు, ఎమ్పిటిసిలు, సర్పంచ్ లను సత్కరించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో కార్తీక పూజ, శాస్త్రీయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో, ఆటల పాటల పోటీలు నిర్వహిస్తామని విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా, రాఘవేంద్ర నగర్, ఒన్ టౌన్, మద్దూరు నగర్ ల నుండి ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగర, జిల్లా బలిజ సంఘీయులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం గావించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పత్రిక సమావేశంలో సంఘం ప్రధాన సలహాదారులు సింగంశెట్టి సోమశేఖర్, కోశాధికారి ప్రకాశ్ బాబు, సంఘం నాయకులు రామిరెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, రాజశేఖర్, లక్ష్మీనారాయణ, వీరేష్, అనిమిరెడ్డి, శోభన్ బాబు, రాము, కాంచన్ కుమార్, జగదీష్, సీతారామ్, శివరాముడు, మాధవరావు, రమేష్, వెంకటేశ్వర్లు, నారాయణస్వామి, అజయ్ మొదలగు వారు పాల్గొన్నారు.