BREAKING
శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి-సర్పంచ్ దాసరి రమేష్ ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..! మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు గీత పనివారాల సంఘం అధ్యక్షులుగా కుమారస్వామి కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి లండన్‌లో భారతీయ మహిళ దారుణ హత్య: అనుమానితుడిపై విచారణ తేదీ ఖరారు చేసిన బ్రిటన్ న్యాయస్థానం! రావణాసుర వధకు సర్వం సన్నద్ధం లింగాల ఘణపురం నూతన ఎస్సైగా కల్తి కిషోర్ బాధ్యతల స్వీకరణ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారం: సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసిన డెహ్రాడూన్ పోలీసులు! సబ్‌స్క్రిప్షన్ ఉచ్చుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూజర్ల అసహనం.. కఠిన చర్యలకు డిమాండ్, లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి! దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అత్యంత సమీపంలో ఉన్నాం:మార్కో రుబియో సంచలన ప్రకటన. కొల్లేరు సంఘం పెద్దల నిరసన ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి నల్ల రవి

ఉదయం మహిషాసుర మర్దిని.. సాయంత్రం కాళికాదేవిగా వాసవీ అమ్మవారి దర్శనం

Select Suryaa Now
ఉదయం మహిషాసుర మర్దిని.. సాయంత్రం కాళికాదేవిగా వాసవీ అమ్మవారి దర్శనం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ పట్టణంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న 23వ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు ఉదయం మహిషాసుర మర్దిని దేవిగా, సాయంత్రం కాళికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు టి.వి.ఎ. రామ తారకం అధ్యక్షతన ఆలయ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవారి అలంకరణకు వనపర్తి అప్పల శ్రీనివాసరావు దంపతులు చీర సమర్పించారు. ప్రత్యేక పూజల్లో తాడికిమళ్ల శివ దంపతులు, పద్మనాభుని శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. మోతుకూరి నారాయణరావు దంపతులు, వంకదార శ్రీనివాస్ శేషగిరి గుప్తా దంపతులు ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో కంచర్ల విష్ణు, కనమర్లపూడి నాగ సుబ్రహ్మణ్యం, డాక్టర్ జయవరపు చక్రవర్తి, యంత్రప్రగడ శ్రీనివాసరావు, కంకిపాటి పవన్ గంగాధర్, బవిరిశెట్టి నాగేశ్వరరావు, వందనపు సర్ణ రాజా, జయవరపు రాంబాబు, బవిరిశెట్టి శ్రీను, వందనపు నాగేశ్వరరావు, వందనపు కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా