తూర్పు అగర్త కట్ట లో పేదలకు అన్నదానం
నెల్లూరు, రాపూరు , మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి చెందిన దివంగత డ్రైవర్ షేక్ మదర్ సాహెబ్ కుమారుడు లేట్ షేక్ మజహర్, కుమారుడు షేక్ అప్సర్ ఆధ్వర్యంలో బుధవారం తన తండ్రి మజహర్ వర్ధంతి సందర్భంగా రాపూరు తూర్పు అగర్త కట్ట వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలకు అన్నదానం చేసి వారి ఆకలి తీర్చారు. తండ్రి మరణించినా ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ, వర్ధంతిని కేవలం స్మరణకే పరిమితం చేయకుండా పేదలకు అన్నం పెట్టడం ద్వారా షేక్ అప్సర్ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. మరణించిన తమ ఆత్మీయుల జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, ఇతరులకు స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో లేట్ షేక్ మజహర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.