తొలిరోజు 60 నామినేషన్ల దాఖలు
తొలిరోజు 60 నామినేషన్ల దాఖలు
- సర్పంచ్ స్థానాలకు 21..
- వార్డు సభ్యులకు 39 నామినేషన్లు
- చీరాల: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు చీరాల మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 60 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.15 సర్పంచ్ స్థానాలకు గాను 21 మంది అభ్యర్థులు, 192 వార్డు సభ్యుల స్థానాలకు గాను 39 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు వెల్లడించారు. దీంతో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.మరో రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.