BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్!

Select Suryaa Now
తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్!

తిరుపతి ఆలయం నుండి ఈరోజు సెప్టెంబర్ 2న సంచలన అప్డేట్ - బ్రహ్మోత్సవాలకు ముందు TTD కీలక నిర్ణయాలు - భక్తులకు ముఖ్య గమనిక!తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఈరోజు సెప్టెంబర్ 2న వరుస అప్డేట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు TTD అధికారులు ఫుల్ స్పీడ్ తో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న, నేడు రెండు కీలక సమీక్షలు జరిగాయి.1. ఇంజనీరింగ్ పనులపై అడిషనల్ EO సమీక్ష:
తిరుమలలో నిన్న సెప్టెంబర్ 1న అడిషనల్ EO శ్రీ వెంకయ్య చౌదరి ఇంజనీరింగ్ పనులపై రివ్యూ చేశారు. సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ పనులు బ్రహ్మోత్సవాల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, నీటి సరఫరా, లైటింగ్ వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.2. లగేజ్ కోసం కొత్త టెక్నాలజీ - GMR తో ఒప్పందం:
భక్తుల లగేజ్ మేనేజ్మెంట్ కోసం TTD కొత్త టెక్నాలజీ తీసుకొస్తోంది. GMR సంస్థ అధికారులు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇకపై తిరుమలలో లగేజ్ పోవడం, ఆలస్యం అనే సమస్య ఉండదని TTD చెబుతోంది.3. గోవిందరాజస్వామి ఆలయంలో సెప్టెంబర్ ఉత్సవాలు:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెలలో స్పెషల్ ఉత్సవాలు జరగనున్నాయి.సెప్టెంబర్ 4న గోకులాష్టమి - శ్రీకృష్ణుడికి అభిషేకం, బంగారు వాకిలి వద్ద పురాణ ప్రవచనంసెప్టెంబర్ 7న చిన్న వీధి ఉట్లోత్సవం, సెప్టెంబర్ 8న పెద్ద వీధి ఉట్లోత్సవంసెప్టెంబర్ 12న ఉత్తరా నక్షత్ర ఉత్సవం4. బ్రహ్మోత్సవాల సమయంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు - భక్తులకు ముఖ్య గమనిక:
ఇది అతి ముఖ్యమైన అప్డేట్. సెప్టెంబర్ 8, 14 తేదీలలో మరియు సెప్టెంబర్ 15 నుండి 23 వరకు బ్రహ్మోత్సవాల సమయంలో VIP బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఆర్జిత సేవలు, సీనియర్ సిటిజన్లు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, NRI దర్శనాలు కూడా రద్దు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు.5. వేంకటపాలెం శ్రీవారి ఆలయ పనులు వేగవంతం:
అమరావతి దగ్గర వేంకటపాలెంలో కడుతున్న శ్రీవారి ఆలయం పనులను JEO శరత్ నిన్న పరిశీలించారు. రెండో ప్రాకారం, నాలుగు గాలిగోపురాల పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.భక్తులు ఈ విషయాలను గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని TTD విజ్ఞప్తి చేసింది.