BREAKING
మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు

తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని బీసీ మహిళ తిరుత్తణి శైలజకు ఇవ్వాలి.. విష్ణు మమత విజ్ఞప్తి

Select Suryaa Now
తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని బీసీ మహిళ తిరుత్తణి శైలజకు ఇవ్వాలి..  విష్ణు మమత విజ్ఞప్తి

బీసీ మహిళ, వర్ధమాన రాజకీయాల్లో చురుకైన నాయకురాలు, ఉన్నత విద్యావంతురాలు, అలాగే రాజకీయ వారస త్వం కలిగిన తిరు త్తణి శైలజ వేణు గోపాల్ కు తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని  కేటాయించాలని, తద్వారా మహిళా సాధికార తను చాటాలని రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ నేతృత్వంలోని  బీసీల విభాగమైన సమస్త గాండ్ల తెలికుల ప్రజా సంక్షేమ సంఘం (ఎస్జీటిపీఎస్ ఎస్) రాష్ట్ర  ఉపాధ్యక్షుడు కేపీ కుమార్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు చదివే విష్ణు మమత, నెల్లూరు పల్లి విశాలాక్షి, కదిరి చదివే. సూర్య నారాయణ కూటమి ప్రభుత్వాన్ని కోరారు.  తిరుత్తణి శైలజ వేణు గోపాల్ కు విద్యార్హత, రాజకీయ అను భవం ప్రత్యేక ఆకర్షణలు అని వారు తెలిపారు. సామాన్యకుటుంబం నుంచిరాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శైలజ వేణుగోపాల్ కు ఇలాంటి పద వులు ఇచ్చి ప్రోత్స హిస్తే రాజకీయ అనుభవం కూడా మరింతగా కలిసొస్తుందని వారు అభిప్రాయపడ్డారు.  బీసీ మహిళగా డిప్యూటీ మేయర్ పదవిని కేటాయిం చడం వల్ల బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు మహిళా సాధికారతకు తోడ్పాటును అందిం చిన వాళ్ళు అవు తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు,  జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యకులకు ఎస్ జీ టీ పీ ఎస్ ఎస్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు.  రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించడం ఆమె ప్రజాబలానికి నిదర్శనమని, వివాద రహితురా లిగా ఉండటంతో పాటు,సానుకూల అంశమైన కుటుంబ నేపథ్యం కూడా కూటమి అధిష్టా నాలు పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు. శైలజ భర్త సైతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ, టీవీ చర్చలు, విశ్లేషణల్లో జనసేన పార్టీ వాణిని బలంగా వినిపిం చడం రాజకీయంగా అదనపు బలమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తిరుపతిలోని బీసీ నాయకుల ఆశీస్సులు,ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మద్దతు కూడా  ఉండడం హర్షనీయ మన్నారు. కూటమి అధిష్టానాలు  సానుకూల నిర్ణయం తీసుకుని తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపికలో తిరుత్తణి శైలజ వేణుగోపాల్ కు అవకాశం కల్పిస్తారన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.