తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల :కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే 66,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 20,856 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.63 కోట్లు లభించిందని టిటిడి అధికారులు వెల్లడించారు.