సోమేశ్వర స్వామి ఆలయం నందు సామూహిక లక్ష కుంకుమార్చన
పుంగనూరు:
పట్టణంలోని శ్రీ ప్రసన్న పార్వతి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం నందు దసర నవరాత్రుల సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఆదివారం నుండి 20వ తేదీ మంగళవారం వరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అభిషేకము, విశేషాలు అలంకారము, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 7 గంటల నుండి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు