తెలుగుదేశం పార్టీలో చేరిన రాచవేటివారిపల్లి యువత : సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : హాజరైన టిడిపి సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్
మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లి నియోజకవర్గం,నిమ్మనపల్లె మండలం,రాచవేటివారిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత గురుమూర్తి ఆధ్వర్యంలో 15 మంది యువకులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.ఇందులో భాగంగా పార్టీలో చేరిన యువకులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీ అభివృద్ధికి,ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.రాచవేటివారిపల్లి గ్రామానికి చెందిన గురుమూర్తి,పవన్ కుమార్,విష్ణు,చందు,సందీప్,మహేష్,గణేష్,నరసింహులు,బాలు,రవీంద్ర తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన దక్షత,మంత్రి నారా లోకేష్ బాబు సమర్థత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని,టిడిపి విధానాలు నచ్చి పెద్దఎత్తున యువత పార్టీలలో చేయడం శుభపరిణామమన్నారు.పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.అనంతరం ఆర్.జె వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తున్నారని,వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు.నారా లోకేష్ స్ఫూర్తితో యువత రాజకీయాల్లో రాణించాలని సూచించారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో నిమ్మనపల్లి మండలాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు.యువత పెద్దసంఖ్యలో పార్టీలో చేరడంతో మండలంలో టిడిపి మరింత బలోపేతం కావడం ఖాయమన్నారు.సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అంబేద్కర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎంపిపి బీదం గురునాథ్ యాదవ్,నియోజకవర్గం అబ్జర్వర్ చంద్రశేఖర్,నిమ్మనపల్లి మండల అధ్యక్షులు రాజన్న,మాజీ సర్పంచ్ మధు,గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున తదితర నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి