టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిక
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ పంచాయితీలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ నాయకులు, మాజీ వార్డు మెంబర్లు ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. శుక్రవారం వైయస్సార్ సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో అనంతపురం రూరల్ పంచాయితీ మాజీ వార్డు మెంబర్లు గంగాధర్, షెక్షావాలి, నాయకుడు మంజునాథ్ లు వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంత వెంకటరామిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరుచనున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ రమేష్ గౌడ్, అనంతపురం రూరల్ పంచాయితీ నాయకులు మహేష్, సుధాకర్ రెడ్డి, నగేష్, అశోక్, శీనా తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్