BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

టీడీపీలోకి ఏడు వైకాపా కుటుంబాలు

Select Suryaa Now
టీడీపీలోకి ఏడు వైకాపా కుటుంబాలు

 

​కోటబొమ్మాళి, నవంబర్ 26, మేజర్ న్యూస్: కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస గ్రామానికి చెందిన ఏడు వైకాపా కుటుంబాలు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గిన్ని ధనుంజయ రెడ్డి, కోళ్ల నీలకంఠ రెడ్డి, గిన్ని ధర్మారెడ్డి, కోళ్ల జనార్దన్ రెడ్డి, గిన్ని జగ్గారావు, గిన్ని ఆమాస్ రెడ్డి తదితరులకు మంత్రి అచ్చెన్నాయుడు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టీడీపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.