తల్లి విజయానికి కుమార్తె ప్రచారం.
*మెట్టూరు బిట్ వన్ లో సర్పంచ్ అభ్యర్థి అదపాక పార్వతి విజయానికి కుమార్తె,మెట్టూరు బిట్ వన్ యంపిటిసి జయలక్ష్మి ,అల్లుడు బూర్లె శ్రీనివాసరావు విస్తృతం గా ఇంటింట ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా యంపిటిసి జయలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల జరిగిన యంపిటిసి ఎన్నికల్లో తనకు గెలిపించినట్లు మెట్టూరు బిట్ 1
సర్పంచ్ గా తన తల్లి పార్వతిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. తన తల్లి పార్వతిని గెలిపిస్తే తన భర్త శ్రీనివాసరావు సహాయంతో ఉత్తమ పంచాయతీ గా తీర్చి దిద్దుతామని తెలిపారు. పార్వతి మద్దత్తు గా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరికాన భవాని ,సుడా చైర్మన్ రవికుమార్ సంయుక్తంగా మెట్టూరు బిట్ వన్ లో విస్తృతంగా పర్యటించారు. మొట్టమొదటి సారిగా కొత్తూరు మండలం లో మెట్టూరు బిట్1 ,
ఆదరించిందని,చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత జిల్లా లో మొట్టమొదటి సారిగా మళ్ళీ ఆదరించిన గ్రామానికే వచ్చానని చైర్ పర్సన్ భవానీ అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు కృషి చేస్తానని, మెట్టూరు బిట్ 1ప్రజలు సర్పంచ్ గా పార్వతి ని గెలిపించాలని భవానీ పిలుపునిచ్చారు.జనసేన అభ్యర్థి గా అదపాక పార్వతి,తన ఎనిమిది మంది వార్డు మెంబర్లను గెలిపించాలని సుడా చైర్మన్ రవికుమార్ కోరారు. మొట్టమొదటి సారిగా మెట్టూరు బిట్ వన్ కు విచ్చేసిన చైర్ పర్సన్ భవనీ కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్బంగా మెట్టూరు బిట్ వన్ లో ఉంటున్న సంకిలి నిర్వాసితులు కొరికాన దంపతులు సమక్షంలో వైసీపీ చెందిన కుటుంబాలు భారీ ఎత్తున జనసేన పార్టీ లోనికి చేరారు. పార్టీ కండువా లు వేసి సాధరంగా పార్టీ లోనికి ఆహ్వానించారు.వీరి చేరిక తో పార్వతి విజయానికి చేరువ లో ఉన్నారని పలువురు భావిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సారిపల్లి ప్రసాదరావు,బూర్లె శ్రీనివాసరావు ,చోడవరపు జోగినాయుడు, లోతుగెడ్డ జనార్ధన రావు, లోతుగెడ్డ తిరుపతిరావు , మండల కన్వీనర్ దొంపాక జయరాజ్ ,
అదపాకఅశోక్ ,సింహాచలం ,సందీప్ ,తదితరులు పాల్గొన్నారు.