స్వచ్చ రధం ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
* ఎంపిడిఓ రవికుమార్
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామంలో స్వచ్ఛ రథం తిరుగుతున్నదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ పి. రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడుతూ ఎవరు ఎక్కువ డ్రై వేస్ట్ ఇస్తారో వారికి గిఫ్ట్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దసరాకి నెల మొత్తం మీద ఎవరు ఎక్కువ డ్రై వేస్ట్ ఇస్తారు ఫస్ట్, సెకండ్,థర్డ్ ప్రైజులు (స్టీల్ బింది, బకెట్, స్టీల్ బాక్స్) దసరా ముందు రోజు నాడు అందజేస్తామని చెప్పారు. గ్రామస్తులందరికీ తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన స్వచ్చ రథం పై అవగాహన కలిగించేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో
స్థానిక పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.