BREAKING
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన

సుందరేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

Select Suryaa Now
సుందరేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్   :      నెల్లూరు దుర్గామిట్ట లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉప ఆలయమైన శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రదోష కాల పూజ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ సుందరేశ్వర స్వామి వారికి, నందీశ్వరునికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ ప్రదోష కాల ప్రత్యేక పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి అభిషేక మహోత్సవాన్ని తిలకించి తారకమంత్ర స్మరణ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులందరికీ స్వామివారి పంచామృతం, పులిహోరను ప్రసాదంగా పంపిణీ చేశారు.   ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయ సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ ఛైర్మన్  ఏలూరు శిరీష ఆధ్వర్యంలో సమర్థవంతంగా సాగాయి.