BREAKING
వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం. మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి.. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.. జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు. కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. నేటి రాశి ఫలాలు 16 నవంబర్, 2026 నేటి పంచాంగం 16 నవంబర్, 2026

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి..

Select Suryaa Now
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి..

                   వీర్రాజు మామిడి ఆలయంలో ప్రత్యేక పూజలు.. భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన భక్తులు
అనపర్తి మేజర్ న్యూస్. అనపర్తి గ్రామంలోని, ఎర్ర కాలవ గట్టుపై, వీర్రాజు మామిడి వద్ద వేంచేసి ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాటమంచి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షష్టి మహోత్సవంలో భాగంగా నిర్వహించే రాటమంచి కార్యక్రమానికి విశేష ప్రాధాన్యత ఉంది. స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సంప్రదాయ ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని భక్తితో కొలిచారు.కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం సందర్భంగా అనపర్తితో పాటు పరిసర గ్రామాల భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాటమంచి కార్యక్రమంతో షష్టి మహోత్సవ సందడి ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.