BREAKING
వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం. మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి.. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.. జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు. కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. నేటి రాశి ఫలాలు 16 నవంబర్, 2026 నేటి పంచాంగం 16 నవంబర్, 2026

కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన.

Select Suryaa Now
కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన.

 బిక్కవోలు మేజర్ న్యూస్: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని, కొంకుదురు శాఖా గ్రంథాలయంలో రెండో రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. అలాగే ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా సండే స్టోరీ టైం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్.కె.ఎస్.ఆర్. జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, పాఠకులు చక్రవర్తి, రాఘవరెడ్డి, విజయశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తక పఠనం మానసిక ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని, పోటీ ప్రపంచంలో విజయానికి దోహదపడుతుందని అన్నారు. నేటి రోజుల్లో పుస్తక పఠనం తగ్గడం ఆందోళనకరమని, ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారి ఎన్. బాల అధ్యక్షత వహించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠకులు పాల్గొన్నారు.