గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి
ఆత్రేయపురం మేజర్ న్యూస్ గ్రామాలలో ఉన్న గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికి విజ్ఞానానికి దోహదపడతాయని పలువురు వక్తలు అన్నారు ఆదివారం గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా ఆత్రేయపురం పేరవరం శాఖా గ్రంథాలయాలలో గ్రంధాలయం అధికారులు తమ్మ నమఃశివాయ శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన, పుస్తకాలు చదవడం యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు విద్యార్థులను కష్టపడి చదవద్దు అని ఇష్టపడి చదవమని ప్రోత్సహించారు విద్యార్థులకు పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యత వివరించారు వారం రోజులు జరిగే పోటీలలో పాల్గొనాలనీ. విద్యార్థులకు సూచనలు చేశారు పాల్గొనే విధంగా శ్రద్ద వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు ఆయా కార్యక్రమాలలో గ్రామ పెద్దలు విశ్రాంత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు