BREAKING
వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం. మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి.. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.. జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు. కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. నేటి రాశి ఫలాలు 16 నవంబర్, 2026 నేటి పంచాంగం 16 నవంబర్, 2026

డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు..

Select Suryaa Now
డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు..

అనపర్తి మేజర్ న్యూస్. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో ఆదివారం కార్తీక వన సమారాధన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, నిరంతర ప్రజా సేవకుడు, గ్రామ అభివృద్ధిలో తనవంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ ప్రజలతో మమేకమై ఉండే ద్వారంపూడి నారాయణరెడ్డి, మాణిక్యం దంపతులు, వీరి కుమారుడు ద్వారంపూడి దేవేందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో డీఎన్ఆర్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు హాజరయ్యారు. ముందుగా వారు ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి నమస్కరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులకు నిర్వాహకులు ఘనంగా పౌరసన్మానం నిర్వహించారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అనపర్తి జడ్పీటీసీ సభ్యుడు వాసంశెట్టి నాగేశ్వరరావుతో పాటు ఎంపీటీసీ సభ్యులు గుడాల దుర్గ,  గుత్తుల సత్యనారాయణలను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. 

అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులను కూడా నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించారు. కార్తీక మాసం విశిష్టతను చాటుతూ నిర్వహించిన ఈ వన సమారాధనకు పాలమూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు తరలివచ్చారు. ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి, ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అయ్యప్ప, ఇతర మాలధారణ స్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు.

భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. డీఎన్ఆర్ గ్రౌండ్స్ మొత్తం భక్తులు, సందర్శకులతో కిటకిటలాడింది. ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ సమేతంగా వచ్చిన వారికి ఆహ్లాదాన్ని అందించేలా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఎయిర్ బెలూన్ ఆటవస్తువులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా కార్యక్రమం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.కార్తీక మాస పవిత్రత, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వన సమారాధన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ద్వారంపూడి నారాయణరెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి, ఉత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.