చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం.
రంగంపేట మేజర్ న్యూస్. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత, విప్లవోద్యమ అగ్రనేత కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 42వ వర్ధంతి సభను ఆదివారం రంగంపేట మండలం సింగంపల్లి శివారులోని సీపీ రెడ్డి నగర్‌లో నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ చండ్రపుల్లారెడ్డి భూపోరాటాల ద్వారా లక్షల ఎకరాల భూములను పేదలకు అందించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం భూమిలేని పేదలకు భూములు అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సీపీ రెడ్డి నగర్‌లో నివసిస్తున్న 300 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, మడికి సత్యం, కుంచే అంజిబాబు, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.