మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల
పి. గన్నవరం మేజర్ న్యూస్ :పి. గన్నవరం మండలం మానేపల్లి శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీలను నిర్వహించారు. గ్రంథాలయ అధికారి బి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్. కళ్యాణి క్విజ్ పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో సిహెచ్. సనశ్రీ కాంక్ష, సిహెచ్. డిస్కాంత్ కుమార్, ఎం. హర్షిత, ఎం. సాయి సూర్య, ఎస్. యోషిత విజేతలుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురమళ్ళ అంజిబాబు, పి. వెంకటేశ్వరరావు, సిహెచ్. ధనలక్ష్మి, నాగలక్ష్మి, పి. సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు పాల్గొన్నారు.