BREAKING
వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం. మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి.. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.. జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు. కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. నేటి రాశి ఫలాలు 16 నవంబర్, 2026 నేటి పంచాంగం 16 నవంబర్, 2026

ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

పెరవలి మేజర్ న్యూస్:తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని శ్రీ యినుపకోళ్ల రాఘవరావు మెమోరియల్ శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెరవలి మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ-2) షేక్ సూర్జాన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ ఉద్యమ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ భవన దాత శ్రీ యినుపకోళ్ల అప్పారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ-2 షేక్ సూర్జాన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ వారోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు తప్పనిసరిగా గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం చేయాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల్లో చదువుకోవడం ద్వారా ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, తాను కూడా నిత్య గ్రంథాలయ విద్యార్థినేనని తెలిపారు. మేధావులు, విజ్ఞానవంతులు గ్రంథాలయాల నుంచే తయారవుతారని, దేశ భవిష్యత్తు చదువుకున్న యువతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను ప్రేమించి, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఎంఈఓ స్వయంగా రచించి ఆలపించిన గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంఈఓను ఘనంగా సన్మానించారు.

అనంతరం నవంబర్ 15వ తేదీ ఆదివారం నిర్వహించిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూజ్య సోమేశ్వర పణికుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి ముళ్లపూడి బుల్లచ్చన్న, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూర్యనారాయణ, మోటుపల్లి శ్రీరామమూర్తి, కరటూరి విశ్వనాథం, మద్దిపాటి సత్యం, కొంపెల్ల పట్టాభిరామ, నల్ల సత్యనారాయణ, వంకిన రామారావు, పాతూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు కాళిదాసు ప్రసాద్, బోళ్ల మంగారావు, రిసోర్స్ పర్సన్ శ్రీమతి ఎం. పుష్పావతి, బీడీసీ ఏజెంట్లు శ్రీమతి కె. సత్యవతి, ఎం. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూజ్య సోమేశ్వర పణికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ దేవాలయం ఎంత పవిత్రమైనదో గ్రంథాలయం కూడా అంతే ప్రాముఖ్యత కలిగినదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన అలవాట్లలో గ్రంథాలయ సందర్శనను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయంలోని పుస్తకాలను చదవడం ద్వారా అనేక విషయాలపై అవగాహన పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు.

గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సలాది వీర వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ మనసుకు ప్రశాంతతను అందించడంలో గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రంథాలయాధికారి ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా వారం రోజులపాటు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులు, పాఠకులు తప్పనిసరిగా పాల్గొనాలని, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలను ప్రతి ఒక్కరూ చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.