BREAKING
బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి తానాం గ్రామంలో ఆదర్శ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రులు ప్రారంభం మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఫోటో. టిడిపి బీసీ నాయకులతో సమావేశ మైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్

బీసీల రాజకీయ సాధికారతకు, వారి సమగ్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని ఆళ్లగడ్డ శాసనసభ్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు  ఇచ్చిన మాటకు కట్టుబడి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లతో టిక్కెట్లు కేటాయించి వారికి సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆదివారంనియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ముఖ్యమైన బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ... బీసీల రాజకీయ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి, 1995లో వాటిని 34 శాతానికి పెంచిన ఘనత ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా టీడీపీదేనని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, బీసీలకు దక్కాల్సిన రాజకీయ హక్కులను మరియు ప్రాతినిధ్యాన్ని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు.మరోవైపు, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు తెరవెనుక చేస్తున్న కుట్రలను, వారి నిత్య విద్రోహ, బీసీ వ్యతిరేక వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. ఎన్నికల్లో బీసీ వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తున్న వైఎస్సార్‌సీపీ కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారని, ఆ పార్టీకి బీసీల సంక్షేమంపై ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖ బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీసీల రాజకీయ సాధికారతకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు.