BREAKING
వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.. ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలి*

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలి*

 

*స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలి*

*ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి*

*ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు*

కర్నూలు, అక్టోబర్ 08:స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్ లను ఆదేశించారు.

గురువారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి  విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష  నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు జిల్లాల్లో అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ROలు, AROల నియామకం, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, శిక్షణ, బ్యాలెట్ బాక్సుల లభ్యత, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు తదితర అంశాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల రవాణా, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24×7 సీసీ కెమెరా నిఘా, అవసరమైన చోట వీడియోగ్రఫీ, లాగ్ బుక్స్ నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నగదు, బహుమతులు, ఇతర ప్రలోభాలపై పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, పెండింగ్ నాన్‌-బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులపై నిబంధనల మేరకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక మొబైల్ యాప్‌లు, SEC పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. నామినేషన్లు, పోలింగ్ శాతం, ఫలితాలు, డిక్లరేషన్ వివరాలను నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు.  రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం పొందాలని సూచించారు.

*స్థానిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్  సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది వివరాలను సిద్ధం చేసుకోవడంతో పాటు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లు, ఎన్నికల సామగ్రి తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలను రాజకీయ పార్టీలకు వివరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.