స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి నూతిమడుగులో పార్టీ ఐడీ కార్డుల పంపిణీ.. శ్రేణులకు తలారి రంగయ్య దిశానిర్దేశం
అనంతపురం బ్యూరో : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపునిచ్చారు. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో నిర్వహించిన వైసీపీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేసి, వాటి ప్రాధాన్యతను, కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకమని, గ్రామస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణకు సిద్ధం కావాలని తలారి రంగయ్య దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కంబదూరు మండలానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.