BREAKING
52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట!

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి:

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి:

బొబ్బిలి, సూర్య: స్థానిక మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ బొబ్బిలి నియోజకవర్గం సిపిఎం పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వామపక్షాలు, కలిసొచ్చే శక్తులతో స్థానిక ఎన్నికల్లో దిగుతున్నామని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలకు నిధులు కోత పెట్టి ప్రజలపై భారాలు వేయడానికి సిద్ధమవుతుందని పట్టణాల్లో 673 జీవో ద్వారా పట్టణ ప్రజలపై అన్ని రకాల సేవలకు యూజర్ చార్జీలు భారం మోపడానికి సిద్ధమవుతుందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పౌరహక్కులు, ఓటు చోరీ, రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క అధికారాలను దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా బిజెపి పరిపాలన సాగుతుంది మోడీ చేస్తున్న అన్ని రకాల దుర్మార్గాలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తన విధానాలకు పూర్తిగా భిన్నంగా కేంద్రం వద్ద మోకరిల్లడం తెలుగుజాతికి తీవ్రమైన అవమానమని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీని నేడు ఢిల్లీలో మతోన్మాదులు కాళ్ళ దగ్గర పడేసారని అన్నారు. ఆదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగించేస్తున్న బిజెపి పాలకులు తో కలిస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పచ్చి అబద్ధాలు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి కాదు రాష్ట్రంలో సర్వసంపదలు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడమేనని అన్నారు. స్థానిక ఎన్నికలు అయిన మరుక్షణమే ప్రజలపై భారీగా వెయ్యబోతున్న భారాలకు వ్యతిరేకంగా స్థానిక సంస్థల్లో వామపక్ష అభ్యర్థులకు సిపిఎం పార్టీ అభ్యర్థులకు ప్రజలు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రజల్లో కార్యకర్తలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు మండల నాయకులు సింగిరెడ్డి గోపాల్, వలస శ్రీను వి. శేషగిరి ఉడమల ప్రసాదు జి గౌరీ యుగంధర్ పెంకి రామారావు హరికృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు.