BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ విన్యాసాలు.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్

Select Suryaa Now
స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ విన్యాసాలు.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్

గాజువాక, మేజర్ న్యూస్: కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ ‘సీ విజిలెన్స్–2026’లో భాగంగా విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్‌ఎల్) ప్రాంగణంలో గురువారం ఉత్కంఠభరిత వాతావరణంలో ‘ఆపరేషన్ థండర్’ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రత్యేక కమాండో విభాగమైన ఆక్టోపస్ ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాలు సమిష్టిగా స్పందించే తీరును ఈ విన్యాసాల ద్వారా పరీక్షించారు.

    ​డ్రిల్ ప్రణాళిక ప్రకారం.. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు స్టీల్ ప్లాంట్‌లోని లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎల్ అండ్ డీసీ) భవనంలోకి చొరబడి, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి పలువురిని బందీలుగా చేసుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండో బృందం వ్యూహాత్మకంగా భవనాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించింది. మెరుపు వేగంతో లోపలికి ప్రవేశించిన కమాండోలు ఉగ్రవాదులను సమర్థవంతంగా మట్టుబెట్టి బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా రక్షించారు.

     ​ఈ మాక్ డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందుగా వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీలు బి. కృష్ణ, జి. విశ్వనాథ్, ఇన్‌స్పెక్టర్లు ఇ. శ్రీనివాసరావు, ఆర్. రాంబాబు, బి.ఎస్. నరేష్, పి. ఉమాశంకరరావులతో పాటు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సీఐ కేశవరావు, ఎస్సై నజీర్ పాల్గొన్నారు. వీరితో పాటు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌ఓ, సీఐఎస్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, వైద్య, సేఫ్టీ మరియు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) విభాగాల అధికారులు భాగస్వాములయ్యారు. విశాఖ ఏఆర్ విభాగానికి చెందిన సీఎస్‌డబ్ల్యూ, బాంబ్ డిస్పోజల్ (బీడీ) బృందం, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర పోలీసు బలగాలు ఈ విన్యాసాల్లో పాల్గొని తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సమన్వయాన్ని చాటుకున్నాయి.