BREAKING
సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

సంప్రదాయాలకు పాతర వేస్తున్న టీటీడీ

Select Suryaa Now
సంప్రదాయాలకు పాతర వేస్తున్న టీటీడీ

 చంద్రగిరి మేజర్ న్యూస్ 

 
తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయాలకు పాత్ర వేస్తున్నారని, సంప్రదాయాలను పట్టించుకోకుండా తమకు తీరని అన్యాయం చేస్తున్నారని కొప్పెర వంశస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం కొప్పెర వాండ్ల పల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పెర వంశిస్థులు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొప్పెర వంశస్థులు సాయి సురేష్ మీడియాతో మాట్లాడుతూ,
ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని టిటిడి అధికారులు తుంగలోకి తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 1821 జూలై 25 నుండి కొప్పెర హుండి  శ్రీవారికి ఇచ్చే పద్ధతిని కొనసాగిస్తున్నామని తెలిపారు. కొప్పిర సమర్పించే సమయములో మా కుటుంబంలోని 30 నుండి 40 మందికి శ్రీవారి దర్శనాన్ని కల్పించే వారిని ఆయన తెలిపారు. అయితే.
2024 నుండి మా ఆనవాయితీని కాదని 6 మందికే  దర్శన ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.మా కుటుంబంలో ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళని ఎలా కాదనేది ఎలా అని ఆయన ప్రశ్నించారు.
మా తాతల తరం నుండి అష్టలక్ష్మి గంగాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అందిస్తున్నామని చెప్పారు. టిటిడి అదనపు ఈవో
వెంకయ్య చౌదరి వచ్చినప్పటి నుండి మాకు దర్శనాలు రద్దు చేశారని చెప్పారు. అందుకే ఈ సంవత్సరం గంగాళాన్ని టిటిడి కి ఇచ్చే విధానాన్ని నిలిపివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్తామని తెలిపారు.
మాకు ఇస్తున్న పాత ఆచారాన్ని  కొనసాగించేంతవరకు పోరాడుతామని చెప్పారు. టిటిడి అధికారులు వెంటనే స్పందించి కొప్పెర వంశిస్తులకు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.