స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన - పూర్తి షెడ్యూల్ ఇదే
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. దసరా పండుగను పురస్కరించుకుని వారాంతపు సెలవులతో కలిపి అక్టోబర్ 10 నుంచి 21 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు దసరా సెలవులను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపనున్నారు.