BREAKING
సుపరిపాలనే పెట్టుబడిదారుల విశ్వాసానికి అసలైన పునాది పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభమైంది, రైతుల సంక్షేమానికి, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖలు ప్రొద్దుటూరు కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం ఉదయం 9:30కే రాక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదాం ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం సంకినేని రవీందర్ రావు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు నిరాధారం పూడివలసలో పోలీసుల పల్లెనిద్ర ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతలో ముగిసిన ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ జిల్లావ్యాప్తంగా 2 వేల మందికి పైగా హాజరు.. చరిత్రలో రికార్డు సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్ నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు భోగాపురం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కదిలిన రైతాంగం జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి

స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటిన అక్కాచెల్లెళ్లు.. హీనా ఫైజాకు రెండు స్వర్ణాలు, నైరాకు రెండు రజతాలు

Select Suryaa Now
స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటిన అక్కాచెల్లెళ్లు.. హీనా ఫైజాకు రెండు స్వర్ణాలు, నైరాకు రెండు రజతాలు

అనంతపురం బ్యూరో : స్కేటింగ్ పోటీల్లో అనంతపురం నగరానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. స్థానిక సింజీ స్కూల్‌లో చదువుతున్న హీనా ఫైజా, నైరా తమ క్రీడా నైపుణ్యంతో విజయాన్ని అందుకున్నారు.

సింజీ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న హీనా ఫైజా రింక్‌-1, రింక్‌-3 విభాగాల్లో పోటీపడి రెండు బంగారు పతకాలు సాధించింది. అదే పాఠశాలలో యూకేజీ చదువుతున్న నైరా రింక్‌-4, రింక్‌-5 విభాగాల్లో ప్రతిభ కనబరిచి రెండు రజత పతకాలను కైవసం చేసుకుంది.

చిన్న వయసులోనే స్కేటింగ్‌లో పతకాలు సాధించిన అక్కాచెల్లెళ్లను పలువురు అభినందించారు. కోచ్ అంజి శిక్షణలో వీరు ఈ విజయాన్ని సాధించడం విశేషం. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షించారు.