BREAKING
టోల్‌ ప్లాజా వద్ద టిప్పర్ల అడ్డగింత.. ఉద్రిక్తత. విలేకరుల శిక్షణలో రేణిగుంట 6టీవీ రిపోర్టర్ శీను భారత పారిశ్రామికోత్పత్తిలో విరుద్ధ ధోరణులు: టెక్స్‌టైల్స్, అపెరల్ తయారీ రంగాల మధ్య పెరుగుతున్న భారీ అంతరం అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…? ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం అభిమాని అతిచర్యకు షాకైన కన్నడ నటి రచితా రామ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు క్యాతన్ పల్లి లో నూతన సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలించిన జిల్లా అధికారులు మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం కదిరిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు

రైతుల సంక్షేమానికి, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖలు

Select Suryaa Now
రైతుల సంక్షేమానికి, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి  కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు  సీఎం చంద్రబాబు లేఖలు

అమరావతి: రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు రాసిన రెండు వేర్వేరు లేఖల్లో కోరారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్లు కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలనే అంశాలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. చొరవ తీసుకుని, నిధుల విడుదల, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులను ఆదేశించాలని లేఖలో  శివరాజ్ సింగ్ చౌహన్‌కు విజ్ఞప్తి చేశారు.